Vishal: సామాన్యుడు రాగాలాపన
విశాల్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘సామాన్యుడు’. నాట్ ఏ కామన్ మ్యాన్.. అన్నది ఉపశీర్షిక. తు.ప. శరవణన్ తెరకెక్కిస్తున్నారు. డింపుల్ హయాతి కథానాయిక. యువన్ శంకర్ రాజా స్వరాలందిస్తున్నారు.
విశాల్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘సామాన్యుడు’. నాట్ ఏ కామన్ మ్యాన్.. అన్నది ఉపశీర్షిక. తు.ప. శరవణన్ తెరకెక్కిస్తున్నారు. డింపుల్ హయాతి కథానాయిక. యువన్ శంకర్ రాజా స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్ర థీమ్ మ్యూజిక్‌ను విడుదల చేశారు. స్ఫూర్తివంతమైన సాహిత్యంతో సాగుతున్న ఈ పాటను నివేదిత ఆలపించారు. ప్రచార చిత్రంలో విశాల్ ఫుల్ యక్షన్ మోడ్‌లో కనిపించారు. ‘‘ఆసక్తికరమైన యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. విశాల్ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో యోగిబాబు, రవీనా రవి, బాబురాజ్ జాకబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కెవిన్ రాజా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భన్సాలీ నిర్మాణంలో మృణాల్ చిత్రం!
‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ విజయాలతో జోరు చూపించింది మృణాల్ ఠాకూర్. కానీ, ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీని తర్వాత ఆమె నుంచి మళ్లీ కొత్త కబురు వినిపించలేదు. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘కుబేర’ సందడి
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. -
కేన్స్‌లో కన్నప్ప
ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ బృందం సందడి చేసింది. కథానాయకుడు మంచు విష్ణు, నిర్మాత, నటుడు మంచు మోహన్‌బాబు, నృత్య దర్శకుడు ప్రభుదేవా తదితరులు చిత్రోత్సవాలకి హాజరయ్యారు. -
కొత్త ప్రాజెక్టుతో సారా అలీఖాన్..
ఈ మధ్యే ‘ఏ వతన్ మేరే వతన్’, ‘మర్డర్ ముబారక్’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ కథానాయిక సారా అలీఖాన్. మరో మూడు సినిమాలతో రోజుల్ని బిజీగా గడుపుతున్న ఈమె ఓ కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. -
యంగ్ గ్లోబల్ లీడర్.. భూమి
‘దమ్ లగాకే హైస్సా’, ‘భక్షక్’ లాంటి చిత్రాలతో ఉత్తమ నటిగా నిరూపించుకున్న భూమి పెడ్నేకర్ మరో కొత్త పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి తెరపై కాకుండా.. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) యంగ్ గ్లోబల్ లీడర్‌గా కనిపించనుంది. -
జూన్‌లో హరోం హర
ఈ నెల 31న విడుదల కావల్సిన ‘హరోం హర’ వాయిదా పడింది. జూన్ 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత మంగళవారం ప్రకటించారు. -
ఖురేషి అబ్రమ్ మళ్లీ వస్తున్నాడు
మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా ‘లూసిఫర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
కేన్స్ చిత్రోత్సవాల్లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్
వైవిధ్యమైన కథలకు తెర రూపం ఇచ్చే ఉద్దేశంతో నట జంట రిచా చద్ధా, అలీ ఫజల్ ప్రారంభించిన బ్యానర్.. పుషింగ్ బటన్స్ స్టూడియోస్. ఈ పతాకంపై నిర్మించిన మొదటి చిత్రం ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’. దీంతో సుచీ తలాటీ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. -
పోలీసు హెచ్చరిక
ఏ రోజు నేను వాడిని కలుస్తానో... అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించింది ఓ పోలీసు అధికారిణి. ఇంతకీ ఆమె హెచ్చరిక ఎవరిని ఉద్దేశించో తెలియాలంటే ‘రక్షణ’ చూడాల్సిందే. పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రమిది. -
రెండింతల యాక్షన్‌తో టైగర్..?
ఎన్ని యాక్షన్ చిత్రాలు చేసినా..మళ్లీ కొత్తగానే అనిపిస్తుందంటూ చెప్పే బాలీవుడ్ కథానాయకుడు టైగర్ ష్రాఫ్.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో టైగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. -
బికినీలో రకుల్‌ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్ఐఏ సోదాలతో దుర్గం ఉలికిపాటు
-
దయచేసి వినండి మీ రైలు రద్దయింది!.. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
-
మూడోకన్ను మూసుకుపోయింది.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించని పోలీసులు
-
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
-
‘హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది మ్యాచ్’.. దిగాలుగా హైదరాబాద్ బ్యాటర్
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!